ICBM: ఉత్తర కొరియా దూకుడు..! గంటల వ్యవధిలోనే ఖండాంతర క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా ఓ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ఐసీబీఎం)ని ప్రయోగించింది. గత ఐదు నెలల్లో ఓ ‘ఐసీబీఎం’ను ప్రయోగించడం ఇదే మొదటిసారి.

Published : 18 Dec 2023 14:38 IST

ప్యాంగ్‌యాంగ్‌: ఉత్తర కొరియా (North Korea) కవ్వింపు చర్యలను ఆపడం లేదు. స్వల్పశ్రేణి క్షిపణిని పరీక్షించిన గంటల వ్యవధిలోనే ఓ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ICBM)ని ప్రయోగించింది. గత ఐదు నెలల్లో ఉత్తర కొరియా ఓ ‘ఐసీబీఎం’ను ప్రయోగించడం ఇదే మొదటిసారి. దక్షిణ కొరియా, జపాన్‌లు ఈ ప్రయోగాన్ని ధ్రువీకరించాయి. ఈ క్షిపణి ఆరు వేల కిలోమీటర్ల ఎత్తువరకు చేరుకుందని జపాన్‌ తెలిపింది. దీన్ని మరింత మెరుగైన, చురుకైన ఆయుధంగా నిపుణులు భావిస్తున్నారు. అణు కార్యకలాపాలు చేపట్టకుండా ఉత్తర కొరియాను నిలువరించేందుకు మరిన్ని ప్రణాళికలు రచించాలని దక్షిణ కొరియా, అమెరికాలు యోచిస్తున్న తరుణంలో ఆ దేశం ఈ క్షిపణి ప్రయోగం చేపట్టడం గమనార్హం.

బైడెన్‌ కాన్వాయ్‌ను ఢీకొన్న కారు.. అమెరికాలో కలకలం

ఈ క్షిపణి దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య జలాల్లో పడినట్లు దక్షిణ కొరియా తెలిపింది. గరిష్ఠంగా 6,000 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకుందని జపాన్ అంచనా వేసింది. ఈ ప్రయోగ ఫలితాలు ఉ.కొరియా ఈ ఏడాది జులైలో నిర్వహించిన ‘హ్వసాంగ్‌-18’ క్షిపణి రెండో పరీక్షతో సరిపోలాయి. అంతకుముందు ఏప్రిల్‌లో తొలిసారి ఈ క్షిపణిని పరీక్షించింది. కిమ్ జోంగ్ ఉన్ గతంలో ‘హ్వసాంగ్‌-18’ని తన అణ్వాయుధాల్లో అత్యంత శక్తిమంతమైనదిగా పేర్కొన్నారు. అమెరికా, ద.కొరియా, జపాన్‌లు తాజా క్షిపణి ప్రయోగాన్ని ఖండించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని