Economic Crisis: పాకిస్థాన్‌ ‘ఆర్థిక విధానం’ పనిచేయడం లేదు : ప్రపంచ బ్యాంకు

పాకిస్థాన్ ప్రస్తుత ఆర్థిక విధానం (Economic Model) పనిచేయడం లేదని.. విఫలమైన, కొంత మందికే ప్రయోజనం చేకూర్చే ఈ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది.

Updated : 29 Dec 2023 14:10 IST

ఇస్లామాబాద్‌: కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని (Economic Crisis) ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌.. సహాయం కోసం అంతర్జాతీయ సంస్థలు, వివిధ దేశాలను వేడుకుంటోంది. ఇదే సమయంలో ఈ సంక్షోభం నుంచి బయటపడే మార్గాలపై మాత్రం పెద్దగా శ్రద్ధ పెట్టినట్లు కనిపించడం లేదని తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో ప్రపంచ బ్యాంకు (World Bank) కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ ప్రస్తుత ఆర్థిక విధానం (Economic Model) పనిచేయడం లేదని.. విఫలమైన ఈ విధానాన్ని మార్చుకోవాలని సూచించింది.

‘ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల ముప్పు పాకిస్థాన్‌లో (Pakistan) స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి కూడా కుంటుపడింది. పేదరికం తగ్గించడంలో సాధించిన పురోగతి తిరిగి  మొదటికే వెళ్లడం ప్రారంభమైంది. పాకిస్థాన్‌ ప్రస్తుత ఆర్థిక విధానం పనిచేయడం లేదు. అభివృద్ధిని దెబ్బతీసిన, కొంతమందికే ప్రయోజనం చేకూర్చే ఇటువంటి అస్థిర విధానాలకు స్వస్తి పలకాలి. వీటిని మార్చేందుకు చర్యలు చేపట్టాలి’ అని పాకిస్థాన్‌లోని ప్రపంచ బ్యాంకు డైరెక్టర్‌ నాజీ బెన్‌హస్సీన్‌ పేర్కొన్నారు. ఐరాస అభివృద్ధి కార్యక్రమం (UNDP) తాజా మ్యాగజైన్‌కు రాసిన వ్యాసంలో ఆయన విషయాలు పేర్కొన్నారు.

Benazir Bhutto: 16ఏళ్లయినా.. మిస్టరీగానే ‘భుట్టో’ మరణం!

పాకిస్థాన్‌ ఆర్థిక వైఫల్యాల గురించి మాట్లాడిన నాజీ.. కీలకమైన వ్యవసాయం, ఇంధన రంగాల్లో సమస్యలను పరిష్కరించాలన్నారు. సబ్సిడీలను రద్దు చేయడం, పర్యావరణానికి నష్టం కలిగించే పద్ధతులను ప్రోత్సహించకపోవడం వంటి చర్యలు తక్షణ అవసరమన్నారు. అయితే, ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు అధికారంలో ఉన్నవారు చర్యలు తీసుకుంటారా? అన్నదే పెద్ద ప్రశ్న అని అన్నారు. పాకిస్థాన్‌ ఉజ్వల, సుస్థిర భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాల్సిన సమయం ఇదేనని ప్రపంచ బ్యాంకు స్థానిక డైరెక్టర్‌ సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని