Ukraine Crisis: కీవ్‌లోని సైనిక కర్మాగారాన్ని ధ్వంసం చేశాం: రష్యా

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. కీవ్ వెలుపల సైనిక కర్మాగారంపై తాజాగా దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది......

Published : 18 Apr 2022 02:08 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై పోరును రష్యా మరింత తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే పలు నగరాలను సర్వనాశనం చేసిన మాస్కో సేనలు.. ఇప్పుడు మళ్లీ రాజధాని కీవ్‌పై దృష్టి సారించాయి. ఉక్రెయిన్‌ సైన్యం తమపై దాడులకు పాల్పడుతోందని రెండు రోజుల క్రితం ఆరోపించిన రష్యా దీనికి ప్రతీకారం తీర్చుకోక తప్పదని బెదిరించిన విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. కీవ్ వెలుపల సైనిక కర్మాగారంపై తాజాగా దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘ఆదివారం రాత్రి సమయంలో ఖచ్చితత్వంతో ప్రయోగించిన క్షిపణులు కీవ్ ప్రాంతంలోని బ్రోవరీ సెటిల్‌మెంట్ సమీపంలోని సైనిక కర్మాగారాన్ని ధ్వంసం చేశాయి’ అని మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన చేసింది.

తమ భూభాగంపై విధ్వంసాలకు దిగితే.. కీవ్‌పై క్షిపణుల వర్షం తప్పదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ గత శుక్రవారం హెచ్చరించింది. ‘రష్యా భూభాగంపై ఏదైనా ఉగ్రదాడులు లేదా విధ్వంసానికి పాల్పడాలని చూస్తే కీవ్‌పై క్షిపణి దాడులు మరింత పెరుగుతాయి’ అని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. రష్యా సరిహద్దు నగరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌ క్షిపణి దాడులు చేస్తోందని క్రెమ్లిన్‌ ఆరోపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు