Hunger Crisis: క్షామం అంచున గాజా.. 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో!

ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆందోళన వ్యక్తంచేసింది. ఇక్కడి జనాభాలో 70 శాతం మంది తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు అంచనా వేసింది.

Published : 18 Mar 2024 19:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇజ్రాయెల్‌ (Israel) దాడులతో గాజా (Gaza) పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ (WFP) ఆందోళన వ్యక్తంచేసింది. ఇక్కడి జనాభాలో 70 శాతం మంది తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు తాజాగా అంచనా వేసింది. స్థానికంగా ప్రతిఒక్కరూ సరిపడా ఆహారం కోసం ఇక్కట్లు పడుతున్నారని, ఉత్తర ప్రాంతంలో దాదాపు 2 లక్షల మంది విపత్కర ఆకలి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలిపింది. ఒకవేళ ఇజ్రాయెల్ తన దాడులను రఫాకు విస్తరిస్తే.. మొత్తం 23 లక్షల జనాభాలో సగం మంది క్షుద్బాధకు లోనవుతారని హెచ్చరించింది.

యుద్ధం ముగిసిన తర్వాత.. నెతన్యాహు ప్లాన్‌ ఇదేనటా!

గాజా మొత్తం జనాభాలో నాలుగింట ఒకవంతు మంది (దాదాపు 6 లక్షలు) ఆకలితో అలమటిస్తున్నారని గతేడాది డిసెంబర్‌లో ఐరాస అంచనా వేసింది. మానవతా సాయాన్ని స్వీకరించేందుకు, పంపిణీ చేసేందుకు ఇజ్రాయెల్ ఆంక్షలు అడ్డంకిగా మారాయని స్వచ్ఛందసంస్థలు ఆరోపిస్తున్నాయి. శాంతిభద్రతలు దెబ్బతినడంతో గాజాలో, ముఖ్యంగా ఉత్తరాదిలో సహాయక కార్యకలాపాలు అసాధ్యంగా మారాయని చెబుతున్నాయి. అయితే సాయం విషయంలో తాము ఎటువంటి పరిమితులు విధించలేదని టెల్‌అవీవ్‌ పేర్కొంది. మరోవైపు అమెరికా, జోర్డాన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలు గాజాలో ఆహార పొట్లాలను జారవిడుస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని