A-23a: ఎట్టకేలకు కదిలిన అతిపెద్ద మంచుఫలకం

దాదాపు దుబాయ్‌ అంత విస్తీర్ణంతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచుఫలకంగా గుర్తింపు పొందిన ‘ఎ-23ఎ’.. 30 ఏళ్లకుపైగా విరామం తర్వాత ఎట్టకేలకు కదిలింది.

Updated : 25 Nov 2023 13:24 IST

లండన్‌: దాదాపు దుబాయ్‌ అంత విస్తీర్ణంతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచుఫలకంగా(Worlds biggest iceberg) గుర్తింపు పొందిన ‘ఎ-23ఎ’(A-23a).. 30 ఏళ్లకుపైగా విరామం తర్వాత ఎట్టకేలకు కదిలింది. 1986లో అంటార్కిటిక్‌ తీరరేఖ నుంచి విడిపోవడం ద్వారా ఎ-23ఎ ఏర్పడింది. ఆపై అది కొంత దూరం ప్రయాణించి, వెడ్డెల్‌ సముద్రంలో అడుగు భాగాన్ని తాకి నిలిచిపోయింది. దాని విస్తీర్ణం 4 వేల చదరపు కిలోమీటర్లు. దుబాయ్‌ విస్తీర్ణం 4,114 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుతం మంచుఫలకం ఎట్టకేలకు సాగర అడుగు భాగం నుంచి వేరుపడి.. వేడి జలాల వైపు కదులుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రపంచంలోని చాలా పెద్ద మంచుఫలకాలకు భిన్నంగా.. ఎ-23ఎ తన ఆవిర్భావం నాటినుంచి ఇప్పటిదాకా కేవలం కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే కదిలిందని వారు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని