Medak: ప్రభుత్వాస్పత్రికి తాళం.. వరండాలోనే గర్భిణి ప్రసవం..!

అర్ధరాత్రి పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వస్తే.. తాళం వేసి ఉండటంతో వరండాలోనే మహిళ ప్రసవించింది. కారు చీకట్లో కటిక నేలపై ప్రసవ వేదన పడుతూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ హృదయవిదారక ఘటన మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి గ్రామానికి చెందిన తాటి సృజన పురిటి నొప్పులతో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చింది. డ్యూటీలో ఉండాల్సిన వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. పైగా ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో ప్రసవ వేదన పడుతూ వరండాలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Updated : 12 Mar 2024 15:25 IST

Tags :

మరిన్ని