AP news: మోసపూరిత మాటలతో పేదల ఆశలను కూల్చేసిన సీఎం జగన్

సొంతిల్లు పేదోడి కల. ఆ కలనూ స్వార్థరాజకీయం కోసం వాడుకున్న జగన్.. పేదలకు ఇళ్లు కట్టించడమే లక్ష్యం అంటూ ఎన్నో మాటలు మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 25లక్షల ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్లు 25లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందా?.. వైకాపా పాలనలో ఒక్క పేదవాడికైనా ఇల్లు అందిందా? అంటే లేదనే చెప్పాలి. ఐదేళ్లూ దోచుకోవడం.. దాచుకోవడంపై దృషి సారించిన సీఎం జగన్ ఏనాడు పేదల్ని పట్టించుకున్న పాపాన పోలేదు.

Published : 06 May 2024 10:50 IST

సొంతిల్లు పేదోడి కల. ఆ కలనూ స్వార్థరాజకీయం కోసం వాడుకున్న జగన్.. పేదలకు ఇళ్లు కట్టించడమే లక్ష్యం అంటూ ఎన్నో మాటలు మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 25లక్షల ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్లు 25లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందా?.. వైకాపా పాలనలో ఒక్క పేదవాడికైనా ఇల్లు అందిందా? అంటే లేదనే చెప్పాలి. ఐదేళ్లూ దోచుకోవడం.. దాచుకోవడంపై దృషి సారించిన సీఎం జగన్ ఏనాడు పేదల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఆర్భాటాలు తప్ప ఫలితాలు శూన్యం . తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లనైనా పేదలకు పంపిణీ చేశాడా అంటే అదీ లేదు. వాటిని అందించినా పేదల సొంతింటి కల సాకారం అయ్యేది. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇళ్లుకాదు.. ఊళ్లే నిర్మిస్తామని జగన్ చేసిన ప్రకటనలు నవ్వులపాలయ్యాయి. జగన్ ఐదేళ్ల పాలనలో పేదోడి సొంతింటి కల కలగానే మిగిలింది. ఇదే హామీతో మరోసారి ఎన్నికలకు సిద్ధమైన జగన్ పేదలను ఏ మొహం పెట్టుకొని ఓట్లడుతాడు. ఐదేళ్లలో ఇళ్లివ్వని జగన్‌ను ఈ సారి ప్రజలెలా నమ్ముతారు? 

Tags :

మరిన్ని