Congress: కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. భాజపాలో చేరిన ఇందౌర్‌ అభ్యర్థి

సూరత్‌లో భాజపా అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక నుంచి తేరుకోక ముందే హస్తం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

Published : 30 Apr 2024 10:10 IST

సార్వత్రిక ఎన్నికల సమరంలో పోరాడుతున్న కాంగ్రెస్ (Congress) పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సూరత్‌లో భాజపా అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక నుంచి తేరుకోక ముందే హస్తం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పోలింగ్‌కు కేవలం 15రోజుల ముందు మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అనంతరం ఆయన భాజపాలో చేరడం హస్తం పార్టీలో కలకలం రేపింది. భాజపా బెదిరింపులతోనే అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకుంటున్నారని కాంగ్రెస్ మండిపడింది. 

Tags :

మరిన్ని