Guntur: మేడికొండూరులో తీవ్ర తాగునీటి ఎద్దడి.. గుక్కెడు మంచినీళ్ల కోసం ప్రజల అవస్థలు

ఓవైపు మాడు పగిలేలా సూరీడు చిర్రెత్తిస్తుంటే.. మరోవైపు చెరువులు ఎండి గుక్కెడు నీరు దొరక్క జనం అల్లాడుతున్నారు. కనీసం గొంతు తడుపుకునేందుకు కూడా నీరు లేదు. ‘నీరో రామచంద్రా’ అని ప్రజలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం, అధికారులు వారి మొర ఆలకించడం లేదు. ఆర్థికంగా భారమైనా చాలా మంది ట్యాంకర్లు, డ్రమ్ములతో నీటిని కొనుక్కుని వాడుకుంటున్నారు. దాతలు నాలుగు రోజులకోసారి సరఫరా చేసిన నీటినే బంగారంలా దాచిపెట్టుకుంటున్నారు. తీవ్ర నీటి ఎద్దడితో గుంటూరు జిల్లా మేడికొండూరులో ఎటుచూసినా దాహం కేకలే వినిపిస్తున్నాయి.  

Published : 07 Apr 2024 16:38 IST

Tags :

మరిన్ని