Nara Rohit: బ్యాలెట్‌పై లాస్ట్‌ పంచ్‌తో.. ఫ్యాన్‌ రెక్కలు తెగిపడాలి: నారా రోహిత్‌

రావణాసురుడిని సంహరించడానికి వానరసైన్యం కలిసి వచ్చినట్టు ఏపీలో వైకాపాను అంతం చేయడానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి కలిసి వస్తోందని సినీనటుడు నారా రోహిత్‌ (Nara Rohit) అన్నారు.

Published : 07 May 2024 15:34 IST

రావణాసురుడిని సంహరించడానికి వానరసైన్యం కలిసి వచ్చినట్టు ఏపీలో వైకాపాను అంతం చేయడానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి కలిసి వస్తోందని సినీనటుడు నారా రోహిత్‌ (Nara Rohit) అన్నారు. రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని సత్య ప్రసాద్‌కు మద్దతుగా బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో నారా రోహిత్, హాస్య నటుడు రఘు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓటుతో అందరి లాస్ట్ పంచ్ బ్యాలెట్‌పై పడి.. ఫ్యాన్ రెక్కలు తెగిపడాలని వ్యాఖ్యానించారు. కూటమి అభ్యర్థులను గెలిపించి ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని రోహిత్‌ పిలుపునిచ్చారు.

Tags :

మరిన్ని