Postal Ballot: పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో ఎన్నికల సంఘం వైఫల్యం

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్ల పోలింగ్‌లో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది. ఓట్లు ఇవ్వకుండా కనీస సౌకర్యాలు కల్పించకుండా చేతులెత్తేసింది.

Published : 06 May 2024 13:10 IST

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్ల పోలింగ్‌లో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది. ఓట్లు ఇవ్వకుండా కనీస సౌకర్యాలు కల్పించకుండా చేతులెత్తేసింది. ఫాం-12 సమర్పించినా జాబితాలో పేర్లు గల్లంతవడంపై పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. పలుచోట్ల పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభం కావడంపై ఆందోళనలు చేపట్టారు. ఓట్లు చెల్లకుండా చేసేందుకు కుట్రచేస్తున్నారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో సమస్యలపై స్పందించిన సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా.. ఈ నెల 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

మరిన్ని