Venkatesh: ఖమ్మంలో సినీ నటుడు వెంకటేశ్‌ రోడ్‌ షో.. స్టెప్పులేస్తూ అభివాదం

ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ఆయన వియ్యంకుడు సినీ నటుడు విక్టరీ వెంకటేష్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం ఖమ్మం పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోకు వెంకటేశ్‌ అభిమానులతో పాటు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

Updated : 07 May 2024 20:37 IST

ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ఆయన వియ్యంకుడు సినీ నటుడు విక్టరీ వెంకటేష్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం ఖమ్మం పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోకు వెంకటేశ్‌ అభిమానులతో పాటు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వెంకటేశ్‌ ముందుకు సాగారు. రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని