AP News: వైకాపా కుట్రల అమలులో వెనక్కి తగ్గని సీఎస్‌ జవహర్‌రెడ్డి

నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది.

Published : 07 May 2024 10:14 IST

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా అధికార వైకాపాపై మితిమీరిన స్వామిభక్తిని ప్రదర్శిస్తున్న సీఎస్‌ జవహర్‌రెడ్డి.. తన ప్రతి నిర్ణయాన్ని, ప్రతి అడుగునూ ఆ పార్టీకి ఎన్నికల్లో లబ్ధి కలిగించటమే లక్ష్యంగా వేయటంలో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ఎన్నికల సమయంలోనైనా తటస్థంగా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తారేమోననుకుంటే.. ‘‘లేదు లేదు.. అధికార పార్టీతో అంటకాగుతూ.. ఇంకా అథఃపాతాళానికి దిగజారుతూనే ఉంటా’’ అని తన చేతల ద్వారా పదే పదే నిరూపించుకుంటున్నారు.

Tags :

మరిన్ని