Data Theft: ఐటీ, ఆర్మీ ఉద్యోగులు సహా.. అంగట్లో 16.8 కోట్ల మంది డేటా!

వ్యక్తిగత డేటా సేకరించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మందికి సంబంధించిన డేటా చోరీ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బీమా, రుణాల కోసం దరఖాస్తు చేసినవారి సమాచారం కూడా తస్కసరించారని వెల్లడించారు. ఐటీ, డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగులకు సంబంధించిన కీలక డేటా అమ్మకానికి పెట్టారని వివరించారు. డేటా చోరీతో దేశ రక్షణకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 23 Mar 2023 16:05 IST

మరిన్ని