TS News: రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం!: వాతావరణ కేంద్రం

వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది.

Published : 08 May 2024 19:25 IST

వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. గురువారం వర్షపాతం తగ్గి.. అక్కడక్కడ సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్ష సూచన కనిపించడం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే 12 తేదీన మాత్రం రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నాలుగు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు