భూ వివాదం కారణంగానే రామకృష్ణయ్య హత్య: వరంగల్‌ సీపీ

భూ వివాదం కారణంగానే విశ్రాంత ఎంపీడీవో రామకృష్ణయ్య హత్య జరిగిందని వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. జనగామ జిల్లాలో అపహరణకు గురై, అనంతరం హత్యకు గురైన రామకృష్ణయ్య కేసులో.. ఐదుగురు సభ్యుల సుపారీ గ్యాంగ్‌లో ముగ్గురిని అరెస్టు చేశామని సీపీ వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. అంజయ్య అనే నిందితుడు అసైన్డ్ భూములు కొనుగోలు చేయగా.. ఆ భూములపై రామకృష్ణయ్య అధికారులకు ఫిర్యాదు చేశారని సీపీ తెలిపారు. ఆ ఫిర్యాదు మేరకు అంజయ్య కొన్న భూములను.. అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారని చెప్పారు. ఈ విషయంలో పగ పెంచుకొని, రామకృష్ణయ్యను అంజయ్య సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించాడని సీపీ వివరించారు.

Published : 18 Jun 2023 20:56 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు