Nimmala: తుపాను హెచ్చరికలను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు: నిమ్మల

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో దెబ్బతిన్న పంటలను తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళవారం పరిశీలించారు. ఓ వైపు జోరువాన కురుస్తున్నా.. తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలు చూసి ఆయన చలించిపోయారు. వారితో కలిసి వర్షంలో తడుస్తూనే పొలాల నుంచి నీటిని బయటకు తోడారు. చేతికందిన పంట కోల్పోయామని నిమ్మల ఎదుట పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని.. అందుకే భారీ స్థాయిలో పంట నష్టం సంభవించిందని నిమ్మల ఆరోపించారు.

Published : 05 Dec 2023 17:20 IST

Tags :

మరిన్ని