గోవిందుడినీ వదలని వైకాపా ప్రభుత్వ పెద్దలు.. తితిదే నిధులు దారిమళ్లింపు

తిరుమల శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నిధుల్ని వైకాపా ప్రజాప్రతినిధుల మెహర్బానీ కోసం, ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు ఇష్టానుసారం ఖర్చు పెట్టేశారు. నిక్షేపంగా ఉన్న భవనాల్ని కూలగొట్టి కొత్తవి కడతామంటూ కమీషన్ల రూపంలో రూ.కోట్లు దండుకున్నారు.

Published : 30 Apr 2024 10:16 IST

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. కానీ వైకాపా ప్రభుత్వ పెద్దలకు మాత్రం తిరుమల ఫక్తు వ్యాపార కేంద్రం..! ప్రపంచంలో అత్యధిక ఆదాయ వనరులు కలిగిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటి..! రూ.4 వేల కోట్లకుపైగా వార్షిక బడ్జెట్‌! ఇక చెప్పేదేముంది..! రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెలరేగిపోయారు. శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నిధుల్ని వైకాపా ప్రజాప్రతినిధుల మెహర్బానీ కోసం, ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు ఇష్టానుసారం ఖర్చు పెట్టేశారు. నిక్షేపంగా ఉన్న భవనాల్ని కూలగొట్టి కొత్తవి కడతామంటూ కమీషన్ల రూపంలో రూ.కోట్లు దండుకున్నారు.

Tags :

మరిన్ని