మండల్‌ సిఫార్సులపై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలి

మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని జాతీయ ఓబీసీ మహా సభ నాయకులు డిమాండ్‌ చేశారు. మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు,

Published : 08 Aug 2022 05:28 IST

జాతీయ ఓబీసీ మహా సభ డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని జాతీయ ఓబీసీ మహా సభ నాయకులు డిమాండ్‌ చేశారు. మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, బీసీ కుల గణన తదితర డిమాండ్లపై జాతీయ ఓబీసీ మహాసభ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘాల ఆధ్వర్యంలో దిల్లీలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఇందులో మహాసభ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ బభన్‌రావ్‌ తైవాడే తదితర నాయకులు మాట్లాడుతూ బీసీ కుల గణన, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, జనాభా దామాషా ప్రాతిపదికన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై పలు రాష్ట్రాల శాసనసభలు తీర్మానాలు చేసి పంపినా కేంద్ర ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం దృష్టి సారించకపోతే రైతుల్లానే ఉద్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘాల అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, కేశన శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని