Floods: విలీన మండలాలకు మళ్లీ వరద భయం
గోదావరిలో వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. సోమవారం సాయంత్రానికి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ దఫా గోదావరితోపాటు శబరి నదిలోనూ వరదపోటు ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు
శబరిలో పెరిగిన ప్రవాహం
నీటమునిగిన 216 జాతీయ రహదారి
చింతూరు, కూనవరం, ఎటపాక - న్యూస్‌టుడే: గోదావరిలో వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. సోమవారం సాయంత్రానికి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ దఫా గోదావరితోపాటు శబరి నదిలోనూ వరదపోటు ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. శబరిలో మట్టం గంటకు సుమారు రెండు అడుగుల చొప్పున పెరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని కుంట జనవనరుల కేంద్రం వద్ద శబరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 11.10 మీటర్లకు పెరిగింది. మొన్నటి వరదల సమయంలో కూడా ముందుగా హెచ్చరికలు లేకపోవడం వల్లనే తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానికులు వాపోతున్నారు. ఏపీ- ఒడిశా రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి 216పై చింతూరు మండలంలోని నిమ్మలగూడెం-కుయిగూరు గ్రామాల మధ్య కిలోమీటరు మేర వరదనీరు ప్రవహిస్తోంది. ఈ మార్గం మీదుగా ఒడిశా నుంచి హైదరాబాద్, భద్రాచలం, విజయవాడ, రాజమహేంద్రవరం ప్రాంతాలకు రాకపోకలు, సరకు రవాణా జరుగుతాయి. వరద కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఒడిశా సరిహద్దులోని కల్లేరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ వరద నీటిని దాటాల్సి వచ్చింది. అందులో చాలామంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఒక ట్రాక్టరు ముందు దారి చూపుతూ వెళ్లగా, బస్సు దానిని అనుసరించింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో రెండు, మూడు గంటల్లోనే సుమారు 10 సెంటీమీటర్ల వర్షం పడటంతో వరద మరింత ఉద్ధృతమయ్యే ప్రమాదం ఉందని ఓ అధికారి ‘న్యూస్‌టుడే’తో పేర్కొన్నారు. ఎటపాక మండలంలోని నెల్లిపాక, తోటపల్లి, నందిగామ, రాయనపేట వద్ద పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద వరద నీరు ఇళ్లను ముంచెత్తి, ఆర్‌అండ్‌బీ రహదారి పైకి పోటెత్తింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29/01/2023)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్‌కౌర్