కాంస్య యుగపు శిలా చిత్రలేఖనాలు

కాంస్య శిలాయుగపు శిలా చిత్ర లేఖనాలు నల్లమల అటవీ ప్రాంతంలో వెలుగుచూశాయి. వైయస్‌ఆర్‌ జిల్లా దువ్వూరు మండలం దాసరపల్లె.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి మధ్యన వీటిని గుర్తించినట్లు మైదుకూరుకు చెందిన పురావస్తు పరిశోధకుడు శేగినేని వెంకట శ్రీనివాసులు తెలిపారు.

Published : 25 Jan 2023 04:43 IST

మైదుకూరు, న్యూస్‌టుడే: కాంస్య శిలాయుగపు శిలా చిత్ర లేఖనాలు నల్లమల అటవీ ప్రాంతంలో వెలుగుచూశాయి. వైయస్‌ఆర్‌ జిల్లా దువ్వూరు మండలం దాసరపల్లె.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి మధ్యన వీటిని గుర్తించినట్లు మైదుకూరుకు చెందిన పురావస్తు పరిశోధకుడు శేగినేని వెంకట శ్రీనివాసులు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలోని పెద్దబండలశెలగా పిలిచే ప్రాంతంలోని శివ లింగాలను దర్శించుకునేందుకు వెళ్లగా కొండరాళ్లపై శిలాయుగపు చిత్ర లేఖనాలు కనిపించినట్లు పేర్కొన్నారు. పురావస్తు శాస్త్ర దృష్ట్యా పరిశీలిస్తే జింకలు, దుప్పులు, శివ లింగాలు వంటి 40 చిత్ర లేఖనాలు ఉన్నట్లు తెలిపారు. ఆనాటి మానవులు ఆహార సేకరణతోపాటు జంతువులను మచ్చిక చేసుకుని పశుపోషణ, వ్యవసాయం వైపునకు జీవన విధానాన్ని మరల్చుకున్నట్లుగా రాతిపై ఉన్న చిత్ర లేఖనాల ద్వారా తెలుస్తోందని వివరించారు. లోయ గుహలో చారిత్రక యుగానికి చెందిన శివలింగం ఉన్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని