పశువైద్య విశ్వవిద్యాలయంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు
పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో 2023-24 విద్యాసంవత్సరానికి రెండేళ్ల పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు బుధవారం నోటిఫికేషన్ జారీ అయింది.
ఈనాడు, హైదరాబాద్: పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో 2023-24 విద్యాసంవత్సరానికి రెండేళ్ల పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు బుధవారం నోటిఫికేషన్ జారీ అయింది. పదో తరగతి అర్హతతో పాలిసెట్-2023 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని మహబూబ్‌నగర్, హనుమకొండ జిల్లా మామునూరు, సిద్దిపేట, కరీంనగర్‌లోని పశువైద్య పాలిటెక్నిక్ కళాశాలల్లో 121 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా భావదేవరపల్లిలోని మత్స్యశాస్త్ర(ఫిషరీస్) పాలిటెక్నిక్ కళాశాలలోని 11 సీట్లకూ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు జూన్ 19వ తేదీలోగా పశువైద్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.tsvu.edu.inలో దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Economy: దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో భాజపా ప్రభుత్వం విఫలం: కాంగ్రెస్
-
Tagore Movie: పాటలు వద్దన్న మురగదాస్.. అలా ఛాన్స్ దక్కించుకున్న వినాయక్
-
Manipur : మయన్మార్ సరిహద్దులో కొత్తగా 70కి.మీ మేర కంచె నిర్మాణానికి ప్రణాళిక : మణిపుర్ సీఎం
-
RBI: యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా..
-
Congress: సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: మధుయాష్కీ
-
Hyderabad: పట్టుబడిన వాహనాల వేలం.. పోలీసుశాఖకు రూ.కోట్ల ఆదాయం