మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు
మాజీ ఎమ్మెల్సీ, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం రాత్రి విజయవాడలోని రమేష్ ఆసుపత్రిలో ఆయన్ను చేర్చారు.
ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు
విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్సీ, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం రాత్రి విజయవాడలోని రమేష్ ఆసుపత్రిలో ఆయన్ను చేర్చారు. రాజేంద్రప్రసాద్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని, గురువారం స్టంట్ వేస్తామని వైద్యులు బుధవారం వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న తెదేపా అధినేత చంద్రబాబు వైవీబీకి ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. కాకినాడలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సర్పంచుల సమావేశానికి వైవీబీ హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన అనంతరం ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో స్థానిక వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడ తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.