Eluru: మడుగులా రోడ్డు.. అక్కడే మంచం వేసుకుని యువకుడి నిరసన

అధ్వాన రహదారులతో నిత్యం నరకం చూస్తున్నామని.. గుంతలు నిండిన రోడ్లపై ప్రయాణానికి నానా అవస్థలు పడుతున్నామని అక్కడి ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు.

Updated : 23 Jul 2023 16:34 IST

అధ్వాన రహదారులతో నిత్యం నరకం చూస్తున్నామని.. గుంతలు నిండిన రోడ్లపై ప్రయాణానికి నానా అవస్థలు పడుతున్నామని అక్కడి ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేదు. దీంతో కడుపు మండిన ఓ యువకుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి మాదేపల్లి వెళ్లే రోడ్డులో ఫిల్‌హౌస్‌పేట వద్ద మడుగులా మారిన రోడ్డు మీద శనివారం సాయంత్రం మంచం వేసుకుని పడుకున్నాడు. అటుగా వస్తున్న బస్సును ముందుకు వెళ్లనీయకుండా గంటసేపు ఆపేసి నిరసన తెలియజేశాడు. తర్వాత స్థానికులు అతనికి సర్దిచెప్పి పక్కకు తీసుకురావటంతో బస్సు కదిలింది.

న్యూస్‌టుడే, ఏలూరు టూటౌన్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని