Thailand - Eluru: పందెంకోడిని కొనడానికి.. థాయిలాండ్‌ నుంచి వచ్చి..

సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి, పందెం కోడిని కొనేందుకు థాయిలాండ్‌ నుంచి నలుగురు యువతీయువకులు ఇటీవల ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురానికి వచ్చారు.

Published : 29 Jul 2023 07:35 IST

రూ.3 లక్షలకు కొనుక్కెళ్లిన విదేశీయులు

లింగపాలెం, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి, పందెం కోడిని కొనేందుకు థాయిలాండ్‌ నుంచి నలుగురు యువతీయువకులు ఇటీవల ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురానికి వచ్చారు. గ్రామంలో నాటు కోళ్ల ఫారం నిర్వహిస్తున్న కూరాకుల రత్తయ్య తెలిపిన వివరాల మేరకు.. ఈ ఏడాది భోగి పండుగ రోజున ఆయన తన పుంజుతో పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో రూ.27 లక్షల కోడి పందెం వేయగా, అది గెలిచింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలయింది. దాన్ని చూసిన థాయిలాండ్‌కు చెందిన ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఆ పుంజును కొనడానికి బుధవారం రంగాపురానికి వచ్చారు. విక్రయించడానికి రత్తయ్య నిరాకరించడంతో దాంతో ఫొటో దిగి, మరో పుంజును రూ.3 లక్షలకు కొనుక్కుని పట్టుకెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని