Vandebharat Express: మరింత సౌకర్యంగా వందేభారత్‌ ప్రయాణం

తెలుగు రాష్ట్రాల నుంచి ఈనెల 24న పట్టాలు ఎక్కనున్న రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సౌకర్యాలను రైల్వేశాఖ మెరుగుపరిచింది.

Updated : 22 Sep 2023 06:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల నుంచి ఈనెల 24న పట్టాలు ఎక్కనున్న రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సౌకర్యాలను రైల్వేశాఖ మెరుగుపరిచింది. మొత్తం 25 రకాల మార్పులు చేశామంది. సీట్లలో ఎనిమిదిన్నర గంటలపాటు కూర్చోవాల్సి వస్తుండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. వారు మరింత వెనక్కి వాలి నిద్రపోయేలా పుష్‌బ్యాక్‌ను, సీట్ల మెత్తదనాన్ని పెంచారు. మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌ను, ఫుట్‌రెస్ట్‌ను మెరుగుపరిచారు. మరుగుదొడ్లలో వెలుతురును, వాష్‌బేసిన్ల లోతును పెంచారు. ఏసీ అధికంగా రావడానికి ప్యానెళ్లలో మార్పులు చేశారు. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు గురువారం ట్రయల్‌రన్‌ నిర్వహించారు. ఉదయం కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్లిన ఈ రైలు రాత్రి తిరిగొచ్చింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైళ్లన్నీ గూడూరు నుంచి నేరుగా వెళతాయి. విజయవాడ-చెన్నై వందేభారత్‌ రైలు మాత్రం గూడూరు నుంచి శ్రీకాశహస్తి, రేణిగుంట, అరక్కోణం, తిరువళ్లూరు మీదుగా చెన్నైకి వెళుతుందని ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ‘ఈనాడు’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని