Kodali Nani: ఒక్క పథకం ఆపితే.. రోడ్లు వేయడం కష్టమేమీకాదు: కొడాలి నాని

ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకం ఆపినా రాష్ట్రంలో రహదారులు వేయడం పెద్ద కష్టమేమీ కాదని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

Updated : 21 Nov 2023 07:48 IST
గుడివాడ (నెహ్రూచౌక్‌), న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకం ఆపినా రాష్ట్రంలో రహదారులు వేయడం పెద్ద కష్టమేమీ కాదని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో సోమవారం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు వేయాలంటే రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు సరిపోతాయన్నారు. దీనికి డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఒక్క విడత లబ్ధిని ఆపినా చాలన్నారు. రోడ్లపై ఉన్న చిన్నచిన్న గుంతల వద్ద చేరి తెదేపా, జనసేన నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని