Vidadala Rajini: రజినమ్మ.. కాస్త జనం బాధలు చూడమ్మా!

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి విడదల రజినీని ప్రకటించినప్పటి నుంచి నగరంలోని ప్రతి డివిజన్‌లో ‘మనతో మన రజినమ్మ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Updated : 02 Feb 2024 07:40 IST

ఈనాడు, గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి విడదల రజినీని ప్రకటించినప్పటి నుంచి నగరంలోని ప్రతి డివిజన్‌లో ‘మనతో మన రజినమ్మ’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గురువారం 36వ డివిజన్‌లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం కోసం నగరంలోని గుజ్జనగూళ్ల ప్రధాన రహదారిలో వివేకానంద కూడలి ముందు నుంచి స్తంభాలగరవు కూడలి వరకు మధ్యాహ్నం నుంచే ట్రాఫిక్‌ నిలిపివేశారు. బారికేడ్లతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపెద్ద ఫ్లెక్సీలు పెట్టి క్రేన్‌ను దారికి అడ్డంగా ఉంచడంతో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడ్డారు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని