Guntur: ఉద్యోగులకు మంత్రి అల్లుడి బహుమతుల ఎర

ఆ మంత్రికి ఒకప్పుడు తమ్ముడు అన్నీ తానై నడిపించారు.. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో వైకాపా అధిష్ఠానం మందలించింది. దీంతో ఆయన అక్కడినుంచి వెళ్లి గుంటూరు జిల్లాలో ఓ స్థానంపై కన్నేసి అక్కడ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Updated : 19 Feb 2024 08:09 IST

కులాలు, పార్టీలవారీగా ఓటర్ల వివరాల సేకరణ

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: ఆ మంత్రికి ఒకప్పుడు తమ్ముడు అన్నీ తానై నడిపించారు.. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో వైకాపా అధిష్ఠానం మందలించింది. దీంతో ఆయన అక్కడినుంచి వెళ్లి గుంటూరు జిల్లాలో ఓ స్థానంపై కన్నేసి అక్కడ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ్ముడి స్థానంలో మంత్రి అల్లుడు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో మనవారెవరు? ప్రతిపక్షానికి చెందిన వారెవరు? తటస్థులెవరు? అనే వివరాల సేకరణలో మంత్రి అల్లుడు బిజీగా ఉన్నట్లు సమాచారం. బీఎల్వోలుగా పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులకు బహుమతుల ఎర వేసి ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. చీర, ప్యాంటు షర్టు, టీకప్పుతో కూడిన సంచిని ఉద్యోగులకు ఇస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల వద్ద నుంచి వాలంటీర్లు మొత్తం సమాచారం సేకరించి మంత్రి అల్లుడికి అందజేస్తున్నారు.

ఫోన్‌ నంబర్లు ఎందుకు..?: కులాలు, మతాలు, ఏ పార్టీకి చెందినవారు? వారి ఫోన్‌నంబర్లు తదితర పూర్తి వివరాలను సచివాలయ ఉద్యోగులనుంచి వాలంటీర్లు సేకరిస్తున్నారు. అనంతరం మంత్రికి, ఆయన అల్లుడికి అందిస్తున్నారు. ఇదంతా మూడో కంటికి తెలియకుండా చేస్తున్నారు. నేరుగా ఫోన్లు చేసి ఓటు అభ్యర్థించడం, ప్రచార సందేశాలను పంపేందుకు వాటిని సేకరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఫోన్‌పే, గూగుల్‌పే వంటి ద్వారా నగదు బదిలీ చేసి ప్రలోభాలకు గురిచేయొచ్చనే విమర్శలూ ఉన్నాయి. ఓటర్ల వ్యక్తిగత వివరాల సేకరణ కోసం ఎలాంటి హోదాలేని మంత్రి అల్లుడు సూత్రధారిగా ఉండడం గమనార్హం. దీన్ని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో విపక్షాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని