రెండు నెలలుగా జీతాలందని శాప్‌ కోచ్‌లు

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వర్యంలోని శిక్షకులకు రెండు నెలలుగా జీతాల్లేవు. ఇదిగో అదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు.

Published : 06 May 2024 05:05 IST

అదిగో ఇదిగో అంటూ అధికారుల కాలయాపన

ఈనాడు, అమరావతి: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వర్యంలోని శిక్షకులకు రెండు నెలలుగా జీతాల్లేవు. ఇదిగో అదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. అరకొర వేతనంతో చాలా ఏళ్లుగా పని చేస్తున్న వారు ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాప్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద మంది కోచ్‌లు పొరుగు సేవల (ఔట్‌ సోర్సింగ్‌) విభాగంలో పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.21,500 వేతనం చెల్లిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వంలో వీళ్ల పరిస్థితి చాకిరీ ఎక్కువ.. వేతనం తక్కువ అన్నట్లుగా తయారైంది. ‘ప్లేఅండ్‌పే’ విధానం ప్రవేశపెట్టి శిక్షణ కోసం వచ్చే వారి నుంచి ఫీజులు వసూలు చేసే బాధ్యత కూడా కోచ్‌లకే అప్పగించారు. ఫీజులు వసూలు చేస్తేనే జీతాలిస్తామనడంతో శాప్‌లో రెగ్యులర్‌ కోచ్‌లు అరకొరగా ఉన్నందున పని భారం పెరిగింది. మార్చి, ఏప్రిల్‌కి సంబంధించిన జీతాలు రెండు నెలలుగా చెల్లించకపోవడంతో కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని