Adani group: యూఎస్‌ ఏజెన్సీ నివేదిక.. అదానీ స్టాక్స్‌ జూమ్‌

Adani stocks zoom: అదానీ గ్రూప్‌ షేర్లు మంగళవారం కూడా దూసుకెళ్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ సంస్థ ఇచ్చిన నివేదిక ఇందుకు కారణం.

Updated : 05 Dec 2023 14:18 IST

Adani stocks: ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ (Adani group) కంపెనీ షేర్లు మంగళవారం కూడా రాణించాయి. హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలన్నింటినీ ‘వాస్తవాలు’గా కోర్టు పరిగణించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొనడంతో ఇప్పటికే కంపెనీ షేర్లు దూసుకెళ్తుండగా.. తాజాగా అమెరికా ఏజెన్సీ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూప్‌ షేర్లకు మరోసారి కొనుగోళ్ల కళ కనిపించింది.

👉 Follow EENADU WhatsApp Channel

అదానీ గ్రూప్‌పై యూఎస్‌కు చెందిన షార్ట్ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికను ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (DFC) ‘అసంబద్ధం’ అంటూ పేర్కొంది. శ్రీలంకలో కంటెయినర్‌ టెర్మినల్‌ ఏర్పాటుకు 553 మిలియన్‌ డాలర్లు అదానీ గ్రూప్‌నకు రుణం ఇచ్చే విషయంలో డీఎఫ్‌సీ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో అదానీ గ్రూప్‌ కార్పొరేట్‌ మోసాలకు పాల్పడిందంటూ హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలు అసంబద్ధంగా పరిగణిస్తున్నట్లు డీఎఫ్‌ఎస్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఏజెన్సీ వ్యాఖ్యల నేపథ్యంలో అదానీ కంపెనీ స్టాక్స్‌పై పాలుపోసినట్లయ్యింది.

ఉద్యోగుల వేతనాల కోసం ఇళ్లను తనఖా పెట్టిన బైజూ రవీంద్రన్‌!

అదానీ గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ఏకంగా 10 శాతం మేర పెరిగింది. కంపెనీ మార్కెట్‌ విలువ మరోసారి రూ.3లక్షల కోట్ల మార్కును అందుకుంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ 17 శాతం మేర లాభపడింది. అలాగే అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌ 9 శాతం చొప్పున లాభపడ్డాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ 10%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 7%, అదానీ పవర్‌ 7%, అదానీ విల్మర్‌ 5%, అంబుజా సిమెంట్స్‌ 5%, ఏసీసీ 6%, ఎన్డీటీవీ 7% చొప్పున లాభపడ్డాయి. మొత్తగా అదానీ గ్రూప్‌ కంపెనీల విలువ రూ.14 లక్షల కోట్లు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని