BSNL 5G: 2024లో బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు: అశ్వనీ వైష్ణవ్‌

BSNL 5జీ సేవలు 2024లో ప్రారంభం కానున్నాయని కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. ఒడిశాలో 5జీ సేవల ప్రారంభం సందర్భంగా ఆయన దీనిపై మాట్లాడారు.

Published : 05 Jan 2023 15:10 IST

భువనేశ్వర్‌: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) తన 5జీ సేవలను (5G services) 2024లో ప్రారంభించబోతోందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. ఒడిశాలో జియో, ఎయిర్‌టెల్‌ 5జీ సేవలను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవల ప్రారంభం గురించి చెప్పారు.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌, కటక్‌ నగరాల్లో ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభమయ్యాయని, రాబోయే రెండేళ్లలో ఒడిశా అంతటా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని వైష్ణవ్‌ ఈ సందర్భంగా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించేందుకు వంద 4జీ టవర్లను సైతం ప్రారంభించినట్లు చెప్పారు. తమ 4జీ నెట్‌వర్క్‌ను 5జీకి అప్‌గ్రేడ్‌చేసే విషయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే టీసీఎస్‌, సి-డాట్‌తో కూడిన కన్సార్టియాన్ని షార్ట్‌ లిస్ట్‌చేసింది. ఈ ఒప్పందం ప్రకారం ఏడాదిలో నెట్‌వర్క్‌ను 5జీకి అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవల కోసం మరో ఏడాది వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని