Modi- Sam Altman: మోదీతో ‘చాట్‌జీపీటీ’ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ భేటీ

మొత్తం ఆరు దేశాల పర్యటనలో భాగంగా ఆల్ట్‌మన్‌ (Sam Altman) భారత్‌కు వచ్చారు. నిన్న ఐఐఐటీ దిల్లీలో ప్రసంగించారు. అనంతరం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

Published : 09 Jun 2023 11:36 IST

దిల్లీ: చాట్‌జీపీటీ (ChatGPT)ని రూపొందించిన ఓపెన్‌ఏఐ కంపెనీ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) గురువారం ప్రధాని నరేంద్ర మోదీ (Modi)తో భేటీ అయ్యారు. భారత టెక్ రంగాన్ని మరింత మెరుగుపర్చడంలో కృత్రిమ మేధ (AI) పాత్ర చాలా కీలకమని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. భారత పౌరుల సాధికారత కోసం జరుగుతున్న డిజిటల్ పరివర్తనను వేగవంతం చేసే అన్ని సహకారాలను స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ (Modi)తో సమావేశం అద్భుతంగా జరిగిందని శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) అన్నారు. భారత టెక్ ప్రపంచంలో ఉన్న సామర్థ్యంపై విస్తృత చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. అలాగే కృత్రిమ మేధ (AI) వల్ల దేశం ఏ రకంగా ప్రయోజనం పొందవచ్చో కూడా చర్చించామన్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలోని కీలక వ్యక్తులతో అయిన అన్ని చర్చలు ఫలవంతమయ్యాయని పేర్కొన్నారు. మొత్తం ఆరు దేశాల పర్యటనలో భాగంగా ఆల్ట్‌మన్‌ (Sam Altman) భారత్‌కు వచ్చారు. నిన్న ఐఐఐటీ దిల్లీలో ఏఐ నుంచి భారత్‌ అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలపై ఆయన ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని