Elon Musk: ట్విటర్ సీఈవోగా వైదొలగండి.. ఎలాన్ మస్క్ ‘పోల్’ ఫలితమిదే..!
ట్విటర్ అధిపతిగా కొనసాగాలా..? లేక వైదొలగాలా..? అంటూ ఎలాన్ మస్క్ చేపట్టిన పోల్‌లో ఆయనకు చుక్కెదురయ్యింది. ఈ బాధ్యతల నుంచి వైదొలగాలంటూ 57.5శాతం మంది యూజర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వాషింగ్టన్: ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోన్న ఎలాన్ మస్క్ (Elon Musk)కు ఊహించని పరిణామం ఎదురయ్యింది. తాను ట్విటర్ (Twitter) అధిపతిగా కొనసాగాలా? లేక వైదొలగాలా? అని ప్రశ్నిస్తూ ట్విటర్‌లో చేసిన పోల్‌లో ప్రపంచ కుబేరుడికి చుక్కెదురయ్యింది. మొత్తం 1.75కోట్లకు పైగా ఓట్లు పోలవ్వగా.. అందులో 57.5శాతం యూజర్లు ఎలాన్ మస్క్ వైదొలగాలంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం 42.5శాతం యూజర్లు మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో యూజర్ల నిర్ణయానికి కచ్చితంగా కట్టుబడి ఉంటానంటూ చేసిన వాగ్దానంపై ఎలాన్ మస్క్ ఏం నిర్ణయం తీసుకుంటారనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ట్విటర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ (Elon Musk) దాంట్లో అనేక మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ఆందోళన చెందుతున్న ప్రకటనదారులు ట్విటర్ (Twitter)తో సంబంధాలను తెంచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన దానికి క్షమాపణలు కోరిన ఆయన.. ఇకపై అలా జరగదని హామీ ఇచ్చారు. ఇకపై ట్విటర్‌లో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా పోల్ నిర్వహిస్తానని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన ట్విటర్ ఖాతాలో నిర్వహించిన పోల్‌లో ప్రతికూల ఫలితం వచ్చింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Girish Bapat: భాజపా ఎంపీ గిరీశ్ బాపట్ కన్నుమూత.. ప్రధాని మోదీ విచారం
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ ఇంకెవరికైనా ఇచ్చారా?.. ముగ్గురు నిందితులను విచారిస్తున్న సిట్
-
Movies News
Chamkeela Angeelesi: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘చమ్కీల అంగిలేసి’.. ఈ వీడియోలు చూశారా..!
-
World News
Biden Vs Netanyahu: మా నిర్ణయాలు మేం తీసుకుంటాం.. అమెరికాకు స్పష్టం చేసిన ఇజ్రాయెల్
-
General News
Viveka Murder case: వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్..
-
Sports News
Mumbai Indians: ముంబయికి మాత్రమే ఈ రికార్డులు సాధ్యం.. ఓ లుక్కేస్తారా?