EPFO కీలక నిర్ణయం.. కొవిడ్‌ అడ్వాన్స్‌ నిలిపివేత!

EPFO covid advance: కొవిడ్‌ అడ్వాన్స్‌ సదుపాయాన్ని ఈపీఎఫ్‌ఓ నిలిపివేసింది. కొవిడ్‌ సమయంలో ఈ సదుపాయాన్ని ఈపీఎఫ్‌ఓ తీసుకొచ్చింది.

Updated : 27 Dec 2023 15:41 IST

EPFO Covid advance | ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ సమయంలో తీసుకొచ్చిన కొవిడ్‌ అడ్వాన్స్‌ (Covid advance) సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నిలిపివేసింది. కొవిడ్‌ వేళ ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్‌ఓ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. హెల్త్‌ ఎమర్జెన్సీ జాబితా నుంచి కొవిడ్‌-19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తప్పించిన నేపథ్యంలో ఈ సదుపాయాన్ని నిలిపివేస్తూ ఈపీఎఫ్‌ఓ ఈ నిర్ణయం తీసుకుంది. 

వారం క్రితం ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఈపీఎఫ్‌ఓ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలోనే వెలువడనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంటే ఇకపై పీఎఫ్‌ చందాదారులు కొవిడ్‌ అడ్వాన్స్‌ పేరిట భవిష్య నిధి నుంచి సొమ్ములను ఉపసంహరించుకోవడం సాధ్యపడదు. ప్రస్తుతం ఉమాంగ్‌ యాప్‌లోకి వెళ్లి కొవిడ్‌ అడ్వాన్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే ‘సర్వీసు అందుబాటులో లేదు’ అనే సందేశం కనిపిస్తోంది.

SBI ‘అమృత్‌ కలశ్‌’ గడువు పొడిగింపు.. ఎఫ్‌డీ వడ్డీ రేట్ల పెంపు

కొవిడ్‌ కాలంలో తీసుకొచ్చిన ఈ నాన్‌ రిఫండబుల్‌ అడ్వాన్స్‌ సదుపాయం చాలా మందికి ఉపకరించినా.. కొందరు మాత్రం వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారు. ఈ సదుపాయాన్ని ఇన్నేళ్ల పాటు కొనసాగించడం వల్ల చాలామంది రిటైర్‌మెంట్‌ సేవింగ్స్‌పై ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. 2020 మార్చి 28న తీసుకొచ్చిన కొవిడ్ అడ్వాన్స్‌ సదుపాయాన్ని 2.2 కోట్ల మంది వినియోగించుకున్నారు. రూ.48 వేల కోట్లు కొవిడ్‌ అడ్వాన్స్‌ రూపేణ ఉపసంహరించుకున్నారని ఈపీఎఫ్‌ వార్షిక నివేదిక ద్వారా వెల్లడైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని