Mutual Funds: 23 నెలల గరిష్ఠానికి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల పెట్టుబడులు..

Mutual Funds: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి పెట్టుబడులు 23నెలల గరిష్ఠానికి చేరాయి.

Updated : 09 Mar 2024 01:20 IST

Mutual Funds | దిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడుల జోరు ఫిబ్రవరిలోనూ కొనసాగింది. ఒక్క ఫిబ్రవరి నెలలోనే ఏకంగా రూ.26,866 కోట్ల పెట్టుబడులు మ్యూచువల్‌ ఫండ్లలోకి వచ్చి చేరాయి. దీంతో మొత్తం నిధులు 23 నెలల గరిష్ఠాన్ని తాకాయి. జనవరిలో నమోదైన రూ.21,780 కోట్లతో పోలిస్తే ఇది 23శాతం అధికం.  

‘నెలవారీ క్రమానుగత పెట్టుబడులు (SIP)’ కొత్త గరిష్ఠాలను చేరినట్లు ‘మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ సమాఖ్య (AMFI)’ శుక్రవారం తెలిపింది. జనవరిలో రూ.18,838 కోట్లుగా ఉన్న పెట్టుబడులు ఫిబ్రవరి నాటికి రూ.19,186 కోట్లుకు పెరిగినట్లు తన నివేదికలో పేర్కొంది. 49.79లక్షల కొత్త సిప్‌ రిజిస్ట్రేషన్లతో సిప్ ఖాతాల మొత్తం రూ.8.20 కోట్లకు చేరిందని AMFI సీఈఓ వెంకట్ చలసాని తెలిపారు. దీంతో మొత్తం మీద మ్యూచువల్‌ ఫండ్లలోకి రూ.1.2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ ఆర్థిక తప్పులు చేయొద్దు!

ఫిబ్రవరిలో డెట్‌ ఎంఎఫ్‌లలోకి రూ.63,809 కోట్లు వచ్చిచేరాయి. అంతక్రితం నెలలో ఈ ఫండ్లలోకి వచ్చిన రూ.76,469 కోట్లతో పోలిస్తే కొంచెం మేరకు తగ్గాయి. ఈక్విటీల్లో రూ. 26,866 కోట్లు, హైబ్రిడ్ పథకాల్లోకి రూ. 18,105 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలోని మొత్తం నికర ఆస్తుల విలువ ఫిబ్రవరి ముగిసే నాటికి రూ.54.54 లక్షల కోట్లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు