ఒకాయా ఇ-బైక్‌ డిస్‌రప్టర్‌

దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్‌ ఫెరాటో, సరికొత్త విద్యుత్‌ బైక్‌ ‘డిస్‌రప్టర్‌’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్‌ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది.

Updated : 03 May 2024 13:10 IST

నిర్వహణ వ్యయం 25 పైసలు/కి.మీ.

దిల్లీ: దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్‌ ఫెరాటో, సరికొత్త విద్యుత్‌ బైక్‌ ‘డిస్‌రప్టర్‌’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్‌ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది. ఈ బైకు నిర్వహణ వ్యయం కిలోమీటరుకు 25 పైసలేనని కంపెనీ చెబుతోంది. రాబోయే 90 రోజుల్లో బైక్‌ డెలివరీలు ప్రారంభిస్తామని వెల్లడించింది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 129 కి.మీ. వరకు ప్రయాణించే వీలున్న ఈ బైక్‌ గరిష్ఠ వేగం గంటకు 95 కి.మీ. అని తెలిపింది. మూడేళ్లు/ 30,000 కి.మీ వారెంటీని కంపెనీ అందిస్తోంది. తొలి 1000 మంది వినియోగదారులు కంపెనీ వెబ్‌సైట్‌పై రూ.500 చెల్లించి ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ మొత్తం రూ.2,500కు పెరగనుంది. టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ సస్పెన్షన్‌, డిజిటల్‌ హైబ్రిడ్‌ డిస్‌ప్లే, బ్లూటూత్‌, జీపీఎస్‌ అనుసంధానత వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని