రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కోసం పిరమాల్‌, జ్యూరిచ్‌ ఇన్సూరెన్స్‌ సంయుక్త బిడ్‌!

ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న రిలయన్స్‌ క్యాపిటల్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ను చేజిక్కించుకునేందుకు పిరమాల్‌

Published : 26 Sep 2022 02:07 IST

దిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న రిలయన్స్‌ క్యాపిటల్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ను చేజిక్కించుకునేందుకు పిరమాల్‌ గ్రూప్‌, జ్యూరిచ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు, సంయుక్త సంస్థ ద్వారా బిడ్‌ దాఖలు చేయాలనుకుంటున్నాయి. గత ఆగస్టులో ఈ రెండు సంస్థలు వేర్వేరుగా నాన్‌-బైండింగ్‌ బిడ్లు దాఖలు చేశాయి. చెరో 50 శాతం వాటా కలిగిన స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ద్వారా బిడ్‌ దాఖలు చేయాలని తాజాగా నిర్ణయించాయి. రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని దివాలా ప్రక్రియ కింద దక్కించుకునేందుకు ప్రత్యేక ఆఫర్‌ ఇచ్చినట్లు జ్యూరిచ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. ప్రతిపాదిత సంయుక్త సంస్థ రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ను దక్కించుకుంటే భారతీయ సాధారణ బీమా వ్యాపారంలోకి జ్యూరిచ్‌ ఇన్సూరెన్స్‌ ప్రవేశించినట్లు అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని