10 సెకన్లలో వ్యక్తిగత రుణం: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

పండగల వేళ వివిధ అవసరాలకు, వస్తువుల కొనుగోళ్లకు రుణాలు వేగంగా జారీచేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ‘ఫెస్టివ్‌ ట్రీట్స్‌ 4.0’తో ముందుకు వచ్చింది.

Updated : 28 Sep 2022 11:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: పండగల వేళ వివిధ అవసరాలకు, వస్తువుల కొనుగోళ్లకు రుణాలు వేగంగా జారీచేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ‘ఫెస్టివ్‌ ట్రీట్స్‌ 4.0’తో ముందుకు వచ్చింది. వినియోగదారులకు ఖాతాలు, రుణాలు, కార్డులు, నెలవారీ వాయిదాల్లో రాయితీలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. రూ.40లక్షల లోపు వ్యక్తిగత రుణాన్ని 10.50 శాతం వడ్డీకి అందిస్తున్నామని, తగిన అర్హతలుంటే 10 సెకన్లలోనే ఈ రుణాన్ని మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. వ్యాపార రుణాలు తీసుకునే వారికి పరిశీలనా రుసుముపై 50 శాతం తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. వాహన రుణాన్ని 7.90 శాతం వడ్డీకి ఇస్తున్నట్లు తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు, ఈజీ ఈఎంఐని ఉపయోగించుకుని 24 నెలల సులభ వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించడంతోపాటు, ఎంపిక చేసిన బ్రాండ్ల కొనుగోలుపై 20 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని