Hyderabad: హైదరాబాద్‌లో 2.7% పెరిగిన ఇళ్ల ధరలు

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే.. జులై-సెప్టెంబరు మధ్య కాలంలో సగటున 2.7 శాతం పెరిగినట్లు మ్యాజిక్‌బ్రిక్స్‌ ‘ప్రాప్‌ ఇండెక్స్‌ క్యూ3’ నివేదిక వెల్లడించింది.

Updated : 13 Oct 2022 12:06 IST

తగ్గిన గిరాకీ: మ్యాజిక్‌బ్రిక్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే.. జులై-సెప్టెంబరు మధ్య కాలంలో సగటున 2.7 శాతం పెరిగినట్లు మ్యాజిక్‌బ్రిక్స్‌ ‘ప్రాప్‌ ఇండెక్స్‌ క్యూ3’ నివేదిక వెల్లడించింది. ఇళ్ల గురించి ఆరా తీయడం మూడో త్రైమాసికంలో 6.9% మేర తగ్గిందని పేర్కొంది. సరఫరా సైతం 4.7% తగ్గింది. నాలుగో త్రైమాసికంలో ఇళ్ల గిరాకీతో పాటు, సరఫరా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. చదరపు అడుగు ధర రూ.5,000-7500 మధ్య ఉన్న ఇళ్లకు 44 శాతం గిరాకీ ఉందని పేర్కొంది. 3 బీహెచ్‌కే ఇళ్లకు 45 శాతానికి పైగా గిరాకీ ఉంది. 2 బీహెచ్‌కే ఇళ్ల సరఫరా 43 శాతంగా ఉందని తెలిపింది. ‘పండగల సీజన్‌లో గిరాకీలో వృద్ధి కనిపించే అవకాశం ఉంది. ఆకర్షణీయమైన ఆఫర్లు, రాయితీలను పొందాలనుకునే వారు అధికంగా ఉండొచ్చు’ అని మ్యాజిక్‌బ్రిక్స్‌ సీఈఓ సుధీర్‌ పాయ్‌ అన్నారు. హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో నివాస గృహాలకు అధిక గిరాకీ ఉంది. కొండాపూర్‌, మియాపూర్‌లలో ఐటీ, వాణిజ్య, రెసిడెన్షియల్‌ పరంగా గిరాకీ కనిపిస్తోందని నివేదిక తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని