ఫిన్‌టెక్‌ వెబ్‌సైట్లపై కేంద్రం కొరడా

ఫిన్‌టెక్‌ సంస్థలైన లేజీపే, ఇండియాబుల్స్‌ హోమ్‌ లోన్‌, కిస్త్‌ వంటి వెబ్‌సైట్లను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ బ్లాక్‌ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

Published : 08 Feb 2023 01:52 IST

లేజీపే, ఇండియాబుల్స్‌ హోమ్‌ లోన్స్‌, కిస్త్‌ సైట్లు బ్లాక్‌

దిల్లీ: ఫిన్‌టెక్‌ సంస్థలైన లేజీపే, ఇండియాబుల్స్‌ హోమ్‌ లోన్‌, కిస్త్‌ వంటి వెబ్‌సైట్లను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ బ్లాక్‌ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. చైనా సహా పలు ఇతర దేశాల కంపెనీలు నిర్వహిస్తున్న 232 యాప్‌లను కేంద్రం బ్లాక్‌ చేసిందని వారంటున్నారు. ఆయా యాప్‌లు బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌, అనధికార రుణ సేవలను అందిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘దేశ ఆర్థిక భద్రతకు విఘాతం కలిగించే, అక్రమ మార్గాల్లో నగదు బదిలీ కార్యకలాపాలను సాగిస్తున్న 138 బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ వెబ్‌సైట్లు; 94 అనధికార రుణ యాప్‌లు ఈ జాబితాలో ఉన్న’ట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.  buddyloan.com, cashtm.in, kreditbee.en.aptoide.com, faircent.com, true-balance.en.uptodown.com తదితర వెబ్‌సైట్లు సైతం బ్లాక్‌కు గురైన వాటిలో ఉన్నాయి. అయితే ఈ వెబ్‌సైట్లలో చాలా వరకు మంగళవారంసాయంత్రం వరకు కూడా పనిచేస్తుండడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని