వారానికి 22,907 విమాన సర్వీసులు
వేసవికాల (మార్చి 26 నుంచి అక్టోబరు 28 వరకు) షెడ్యూల్‌లో భాగంగా వారానికి 22,907 దేశీయ విమాన సర్వీసులను భారత విమానయాన సంస్థలు నడపనున్నాయి.
వేసవి షెడ్యూల్ ఇదీ: డీజీసీఏ
దిల్లీ: వేసవికాల (మార్చి 26 నుంచి అక్టోబరు 28 వరకు) షెడ్యూల్‌లో భాగంగా వారానికి 22,907 దేశీయ విమాన సర్వీసులను భారత విమానయాన సంస్థలు నడపనున్నాయి. శీతాకాల షెడ్యూల్‌లో భాగంగా వారానికి నడిపిన 21,941 విమాన సర్వీసులతో పోలిస్తే ఈ సంఖ్య 4.4 శాతం ఎక్కువ అని డీజీసీఏ తెలిపింది. మొత్తంగా 11 విమానయాన సంస్థలు ఈ దేశీయ సర్వీసులను నడపనున్నాయి. అత్యధికంగా ఇండిగో వారంలో 11,465 సర్వీసులను నడపనుంది. 2022 శీతాకాల షెడ్యూల్‌తో పోలిస్తే... వచ్చే వేసవికాల షెడ్యూల్‌లో అలయన్స్ ఎయిర్, ఎయిరేషియా, స్పైస్‌జెట్, విస్తారా సంస్థలు తక్కువ సర్వీసులను నిర్వహించనున్నాయి. స్పైస్‌జెట్ వారానికి 2,240 విమాన సర్వీసులను నడపనుంది. శీతాకాల షెడ్యూల్‌లోని 3,193 సర్వీసులతో పోలిస్తే ఈ సంఖ్య 30 శాతం తక్కువ. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) విడుదల చేసిన వివరాల ప్రకారం..
* వేసవికాల షెడ్యూల్ కింద 110 విమానాశ్రయాల నుంచి వారానికి 22,907 విమాన సర్వీసులు ఖరారయ్యాయి. జెపోర్, కూచ్ బెహర్, హొలింగి, జమ్‌షెడ్‌పూర్, పాక్యోంగ్, మోపా (గోవా).. కొత్త విమానాశ్రయాలు.
* టాటా గ్రూపు నేతృత్వంలోని ఎయిరిండియా నుంచి వారానికి 2,178 విమాన సర్వీసులు ఉండనున్నాయి. శీతాకాల షెడ్యూల్‌లో నిర్వహించిన 1,990 సర్వీసులతో పోలిస్తే ఈ సంఖ్య 9.45 శాతం ఎక్కువ.
* విస్తారా 4.38 శాతం తక్కువగా 1,856 సర్వీసులు నడపనుంది. ఎయిరేషియా సర్వీసుల సంఖ్య స్వల్పంగా తగ్గి 1,456కు పరిమితం కానుంది.
* గో ఫస్ట్‌గా పేరు మార్చుకున్న గో ఎయిర్ విమాన సర్వీసుల సంఖ్య 10.65 శాతం అధికంగా 1,538గా ఉండనుంది.
* అలయన్స్ ఎయిర్ విమాన సర్వీసుల సంఖ్య 14 శాతం తగ్గి 887కు పరిమితం కానుంది. ఆకాశ ఎయిర్ 751 విమాన సర్వీసులను నడపనుంది.
* స్టార్ ఎయిర్, ఫ్లై బిగ్‌లు వరుసగా 234, 220 విమాన సర్వీసులను నడపనున్నాయి. శీతాకాల షెడ్యూల్‌తో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువే.
* కొత్త విమానయాన సంస్థ ఇండియావన్ వేసవికాలం షెడ్యూల్ కింద వారానికి 82 విమానాలను నడపనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Anushka Sharma: పన్ను వివాదంలో లభించని ఊరట.. అనుష్క శర్మ పిటిషన్ కొట్టివేత
-
Sports News
Cricket: అత్యంత చెత్త బంతికి వికెట్.. క్రికెట్ చరిత్రలో తొలిసారేమో!
-
General News
Telangana News: రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు
-
World News
Mobile: ‘ఫోన్ వాడకాన్ని చూసి విస్తుపోయా’.. సెల్‌ఫోన్ పితామహుడు
-
World News
USA: అమెరికాలో భారతీయ టెకీలకు గుడ్ న్యూస్
-
Crime News
Mumbai: ప్రియుడితో భార్య వెళ్లిపోయిందని.. మామను చంపిన అల్లుడు