ఎస్‌బీఐ లైఫ్‌ చేతికి సహారా లైఫ్‌ పాలసీలు, ఆస్తులు

సహారా ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెందిన దాదాపు రెండు లక్షల పాలసీలు, ఆస్తులను టేకోవర్‌ చేయాల్సిందిగా ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఆదేశించింది.

Published : 03 Jun 2023 01:51 IST

దిల్లీ: సహారా ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెందిన దాదాపు రెండు లక్షల పాలసీలు, ఆస్తులను టేకోవర్‌ చేయాల్సిందిగా ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. సహారా లైఫ్‌ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. సహారా లైఫ్‌ జీవిత బీమా వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అర్హత కలిగిన సంస్థ ఐఆర్‌డీఏఐ గుర్తించింది. ఎస్‌బీఐ లైఫ్‌ ఆర్థిక పరిస్థితిపై సంతృప్తి వ్యక్తం చేసింది. సహారా లైఫ్‌ పాలసీదార్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. నిర్దేశించిన సమయంలోగా ఈ ఆదేశాలను అమలు చేయడానికి సభ్యుడు (యాక్చ్యురీ), సభ్యుడు (లైఫ్‌), సభ్యుడు (ఎఫ్‌ అండ్‌ ఐ)లతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు