Swiggy: స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ ఫీజు ఇక డబుల్‌..?

Swiggy: ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ఇప్పటికే వసూలు చేస్తున్న ప్లాట్‌ఫామ్‌ ఫీజును రెట్టింపు చేయనున్నట్లు తెలుస్తోంది.

Published : 23 Jan 2024 15:48 IST

Swiggy | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ (Swiggy) రానున్న రోజుల్లో ‘ఫ్లాట్‌ఫామ్‌ ఫీజు’ (platform fee)ను రెట్టింపు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫీజును రూ.5 నుంచి రూ.10కి పెంచే అవకాశం ఉందని ఆంగ్ల మీడియాలో కథనాలు పేర్కొంటున్నాయి. త్వరలో ఐపీఓగా రానున్న తరుణంలో కంపెనీ నష్టాలను తగ్గించుకోవటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

స్విగ్గీ తొలుత 2023 ఏప్రిల్‌లో కొన్ని నగరాల్లో మాత్రమే ఫుడ్‌ డెలివరీలపై ప్లాట్‌ఫామ్‌ ఫీజు వసూలుచేయడం మొదలుపెట్టింది. కార్ట్‌ విలువతో సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్‌పై రూ.2 చొప్పున ప్లాట్‌ఫామ్‌ ఛార్జీ విధించింది. ఫీజు వసూలుచేస్తున్నా ఆర్డర్లు తగ్గకపోవడంతో కొన్ని వారాల తర్వాత కస్టమర్లందరి నుంచి ఈ ఛార్జీలు వసూలుచేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ప్లాట్‌ఫామ్‌ ఫీజును రూ.5కి పెంచింది. కొన్నిచోట్ల ఆర్డర్‌ను బట్టి రూ.3 వసూలు చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ ఫీజు రూ.10కి పెరగనుందని తెలుస్తోంది.

ఎన్‌పీఎస్‌ మరింత ఆకర్షణీయంగా.. బడ్జెట్‌లో ప్రకటన?

ప్రస్తుతానికైతే స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ ఛార్జీలను పెంచలేదు. అయితే కొందరికి ఆర్డర్‌ చేసిన తర్వాత బిల్లులో ప్లాట్‌ఫామ్‌ ఫీజు రూ.10 చూపించి.. దానిపై ఆఫర్‌ అంటూ రూ.5 వసూలు చేస్తోంది. ధరల్ని పెంచే క్రమంలో ఇలా చేస్తోందని తెలుస్తోంది. దీనిపై స్విగ్గీని ఆంగ్ల మీడియా సంప్రదించగా.. కస్టమర్లను అర్థం చేసుకోవడానికి కంపెనీ చేపడుతున్న అనేక ప్రయోగాల్లో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు. ప్లాట్‌ఫామ్‌ రుసుములో ప్రస్తుతం ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అమలుచేయొచ్చు.. చేయకపోవచ్చంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. స్విగ్గీకి రోజుకు 1.5 నుంచి 2.5 మిలియన్‌ ఫుడ్‌ ఆర్డర్లు వస్తాయి. అంటే స్విగ్గీ ఈ ఫీజును పెంచితే కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు