నెలకు రూ.25వేలు రావాలంటే?

ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.30వేలు వస్తున్నాయి. నా వయసు 22.  మూడేళ్లపాటు నెలకు రూ.15 వేలు మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. దీనికోసం ఏం చేయాలి?

Updated : 24 Mar 2023 11:12 IST

ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.30వేలు వస్తున్నాయి. నా వయసు 22.  మూడేళ్లపాటు నెలకు రూ.15 వేలు మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. దీనికోసం ఏం చేయాలి?

మౌనిక

మీకు మూడేళ్ల వ్యవధే ఉంది కాబట్టి, మీ పెట్టుబడి సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ను పరిశీలించండి. కాస్త నష్టభయం భరించే శక్తి ఉంటే.. రూ.10వేలు రికరింగ్‌ డిపాజిట్‌లో వేసి, మిగతా రూ.5వేలను బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా మదుపు చేయండి.


నా వయసు 27. రూ.8లక్షల వార్షిక వేతనం ఆర్జిస్తున్నాను. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలూ లేవు. రూ. కోటిన్నర వరకూ బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. సాధ్యమవుతుందా?

గౌతమ్‌

సాధారణంగా వార్షిక ఆదాయానికి 10-12 రెట్ల విలువైన జీవిత బీమా సరిపోతుంది. కానీ, చిన్న వయసులో ఉన్నవారు కనీసం 20 రెట్ల వరకూ బీమా తీసుకోవడం అవసరం. అధిక విలువైన టర్మ్‌ పాలసీ కోసం బీమా సంస్థను సంప్రదించండి. రూ. కోటిన్నర వరకూ పాలసీని ఇచ్చే అవకాశం లేకపోలేదు. మంచి క్లెయిం చెల్లింపులు ఉన్న రెండు బీమా సంస్థలను ఎంచుకొని, పాలసీలను తీసుకోండి.


మరో 9 నెలల్లో పదవీ విరమణ చేయబోతున్నాను. నెలకు కనీసం రూ.25 వేలు వచ్చేలా ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. దీనికోసం ఎంత మొత్తం మదుపు చేయాలి?

కృష్ణ

మీకు నెలకు రూ.25 వేలు రావాలంటే.. సగటున కనీసం 8 శాతం రాబడినిచ్చే పథకాల్లో రూ.37.50లక్షలు పెట్టుబడిగా పెట్టాలి. పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ పథకంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ.30లక్షల వరకూ పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. కాబట్టి, రూ.30లక్షలను ఇందులో పెట్టుబడి పెట్టండి. ఇక్కడ 8 శాతం రాబడి అందుతోంది. మిగతా రూ.7.50 లక్షలను పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో మదుపు చేయొచ్చు. ఇందులో 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ రెండు పథకాల్లో మదుపు చేయడం ద్వారా నెలకు రూ.25వేల వరకూ ఆదాయం అందుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు