GST collections: నవంబర్‌ జీఎస్టీ వసూళ్లు ₹1.67 లక్షల కోట్లు

GST collections in Nov: జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. నవంబర్‌లో ₹1.67 లక్షల కోట్లు వసూళ్లు వచ్చినట్లు కేంద్రం తెలిపింది.

Published : 01 Dec 2023 19:51 IST

GST collections | దిల్లీ: దేశంలో మరోసారి భారీగా జీఎస్టీ వసూళ్లు (GST collections) నమోదయ్యాయి. నవంబర్‌ నెలలో ₹1,67,929 కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ వాటా ₹30,420 కోట్లు కాగా.. ఎస్‌జీఎస్టీ వాటా ₹38,226 కోట్లు. ఐజీఎస్టీ రూపంలో ₹87,009 కోట్ల సమకూరగా.. సెస్సుల రూపంలో ₹12,274 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.

ఐజీఎస్టీ రూపంలో వచ్చిన వసూళ్లను ₹37,878 కోట్లు సీజీఎస్టీకి, ₹31,557 కోట్లు ఎస్‌జీఎస్టీ కింద సర్దుబాటు చేసింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 15 శాతం పెరగడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఆరోసారి. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. ₹25,585 కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌లో ₹4,093 కోట్లు వసూళ్లు జరిగాయి. గతేడాది ₹3,134 కోట్లతో పోలిస్తే 31 శాతం అధికం. తెలంగాణలో గతేడాది ₹4,228 కోట్లు వసూళ్లు జరగ్గా.. ఈ సారి 18 శాతం వృద్ధితో ₹4,986 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని