GST Council: 7న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

GST Council: జీఎస్టీ కౌన్సిల్‌ అక్టోబర్‌ 7న సమావేశం కానుంది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ వేదికగా ఈ సమావేశం జరగనుంది.

Published : 26 Sep 2023 13:20 IST

దిల్లీ: వస్తు సేవల పన్నుకు (GST) సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్‌ (GST council) వచ్చే నెల సమావేశం కానుంది. అక్టోబర్‌ 7న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగే 52వ కౌన్సిల్‌ సమావేశంలో ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ వేదికగా ఈ భేటీ జరగనుందని జీఎస్టీ కౌన్సిల్‌ ఎక్స్‌ (ట్విటర్‌) ద్వారా తెలియజేసింది. ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చించనున్నారనేది తెలియాల్సి ఉంది. ఆగస్టు 2న జరగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మూడింటి పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ విధించేందుకు నిర్ణయించారు. అక్టోబర్‌ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని