HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణాలు 1.6 శాతం వృద్ధి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసిక రుణాల్లో 1.60% వృద్ధిని నమోదు చేసింది. డిపాజిట్లు 7.50 శాతం పెరిగాయి.

Published : 04 Apr 2024 18:06 IST

దిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్‌ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్‌ 2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో తన రుణాల్లో 1.60% వృద్ధిని నమోదు చేసింది. డిపాజిట్లు 7.50 శాతం పెరిగాయి. దేశీయ రిటైల్‌ రుణాలు.. గతేడాదితో పోలిస్తే 108.90 శాతం పెరిగాయని బ్యాంకు స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది. వాణిజ్య, గ్రామీణ బ్యాంకింగ్‌ రుణాలు గతేడాదితో పోలిస్తే 24.60 శాతం పెరిగాయి. గత త్రైమాసికంతో పోలిస్తే బ్యాంకు రిటైల్‌ డిపాజిట్లు 6.90 శాతం, హోల్‌సేల్‌ డిపాజిట్లు దాదాపు 10.90 శాతం పెరిగాయి. బ్యాంకు CASA (కరెంట్‌ ఖాతా, సేవింగ్స్‌ ఖాతా) డిపాజిట్లు సుమారు రూ.9.09 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంకుకు సంబంధించిన CASA నిష్పత్తి 2023 డిసెంబర్‌ 31 నాటికి 37.70 శాతంతో పోలిస్తే 2024, మార్చి 31 నాటికి దాదాపు 38.20 శాతంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని