నేలను తాకిన విమానం తోక భాగం.. 5 రోజుల్లో రెండో ఘటన

అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా ఇండిగో విమానం తోక భాగం నేలను తాకింది. ఐదు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన.

Published : 15 Jun 2023 21:19 IST

ముంబయి: ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి ల్యాండ్‌ అవుతుండగా.. ప్రమాదవశాత్తూ తోక భాగం రన్‌వేను తాకింది. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో (Ahmedabad airport) గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై డీజీసీఏ (DGCA) విచారణకు ఆదేశించింది. గడిచిన ఐదు రోజుల్లో ఇది రెండో ఘటన. రెండుసార్లూ ఇండిగోకు చెందిన విమానాలే టెయిల్‌ స్ట్రైక్‌కు గురికావడం గమనార్హం.

బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌ వెళుతున్న ఇండిగో 6E6595 విమానం తోక భాగం ల్యాండింగ్‌ సమయంలో రన్‌వేను తాకింది. దీంతో విమానాన్ని నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ప్రమాద సమయంలో పైలట్లుగా ఉన్న వారిని విధులను నుంచి తాత్కాలికంగా తప్పించింది. ఇండిగో సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపింది.

అంతకుముందు జూన్‌ 11న సైతం కోల్‌కతా నుంచి వచ్చిన ఇండిగోకు చెందిన విమానం దిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా.. తోక భాగం రన్‌వే నేలను తాకింది. అయితే, విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన కారణంగా విమానం వెనుకభాగం దెబ్బతింది. ఈ ఘటన రెండ్రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదు రోజుల వ్యవధిలో ఈ రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు