Indigo: ఎంపీ ఫిర్యాదుతో దిగొచ్చిన ఇండిగో.. స్నాక్స్ కొంటే కూల్‌డ్రింక్స్ ఫ్రీ!
IndiGo stops serving beverages in cans: విమానాల్లో ఇకపై శీతల పానీయాల్ని క్యాన్స్‌లో అందించబోమని ఇండిగో తెలిపింది. భాజపా ఎంపీ ఫిర్యాదు నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.
దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ఇకపై శీతల పానీయాలను (Cool drinks) క్యాన్స్‌లో అందించబోమని తెలిపింది. దానికి బదులు స్నాక్స్‌తో పాటు కాంప్లిమెంటరీగా గ్లాసు జ్యూస్‌ను, కోక్‌ను ఉచితంగా అందించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. భాజపా రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తా చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఇండిగో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
భాజపా ఎంపీ స్వపన్‌దాస్ గుప్తా తాజాగా ఇండిగో సంస్థపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియాకు ఫిర్యాదు చేశారు. ఇండిగో విమానాల్లో శీతల పానీయాల పేరిట దోచుకుంటున్నారని, పైగా బలవంతంగా స్నాక్స్ కొనిపిస్తున్నారని ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదనపు దోపిడీని అరికట్టి విమాన ప్రయాణికులకు ఊరట కల్పించేలా నిబంధనలు మార్చాలని కోరారు.
జియో ఎయిర్‌ఫైబర్ వచ్చేసింది.. ప్లాన్లు, ఫీచర్లివే..!
ఈ నేపథ్యంలో ఇండిగో తన మెనూను సవరించింది. ‘‘ఇంతకుముందు మా మెనూలో క్యాష్యూ రూ.200, కోక్ రూ.100గా ఉండేది. మొత్తం రూ.300 చెల్లించాల్సి వచ్చేది. తాజాగా మెనూను సవరించాం. ఇకపై మీకు కావాల్సిన స్నాక్స్ కొనుగోలుపై (రూ.200) గ్లాసు శీతల పానీయాన్ని లేదా కోక్‌ను ఉచితంగానే అందించనున్నాం. అలాగే ఆన్‌బోర్డు సర్వీసులు పూర్తిగా కస్టమర్ల ఎంపికకు అనుగుణంగా ఉంటుంది’’ అని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. గోగ్రీన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో ప్రతినిధి తెలిపారు. దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌లో ఇండిగోనే మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mexico: మెక్సికోలో ట్రక్కు బోల్తా: 10 మంది వలసవాదులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు